ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు

 కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 8, నవంబర్ *లబ్ధిదారుల ఇళ్లలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కాట శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ విందు *సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ* పటాన్‌చెరు: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమం పండుగ శోభను సంతరించుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి, కాట శ్రీనివాస్ గౌడ్ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు....