మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి..! బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 08 : కోరుట్ల పట్టణంలో మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోరుట్ల పట్టణంలో రోజురోజుకూ మైనర్ యువకుల ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, అతివేగం, అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోడ్లపై కొందరు యువకులు ఇష్టానుసారంగా అతివేగంతో వాహనాలు నడుపుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో కోరుట్ల పట్టణ ప్రజలు,...