అమ్రాబాద్ మండల కేంద్రంలో సీఎం జన్మదిన వేడుకలు.

అమ్రాబాద్ మండల కేంద్రంలో సీఎం జన్మదిన వేడుకలు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 8): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ మరింత ప్రగతి పథంలో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని,తెలంగాణ అభివృద్ధి పరుగులు తీయాలనీ ఆకాంక్షించారు.