అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి – సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ తెలంగాణ కెరటం(నల్గొండ టౌన్): శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అమరవీరులను స్మరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపంపై ఎర్రజెండాను ఆవిష్కరించి, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(యం-యల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ చిత్తలూరు గ్రామం తెలంగాణ, విప్లవ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో గిరిగాని లక్ష్మి నర్సు (గుండయ్య), సుంకరి సాయన్న, నంద్యాల మల్లయ్యలు నిజాం నిరంకుశ...