సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్ – 2005) ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, చట్ట పరిధిలోకి వచ్చే ఇతర సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కుపై అవగాహన కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ చంటి ముదిరాజు ఆదేశాల మేరకు, జిల్లా స్థాయిలో వొడ్నాల రామారావు సమక్షంలో కేక్ కట్ చేసి, ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు..ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యత, దాని...