ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ పార్టీయే..

సోనియా, ఖర్గే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : భారతదేశ స్వతంత్ర చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది, చేసేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ అన్నారు. అందుకు నిదర్శనం 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తనకు కన్నీళ్లు తెప్పించిందని సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు హిందువులు జరుపుకునే పవిత్రమైన దీపావళి పండుగను ముస్లింలు జరుపుకునే ఈద్గా పండుగతో పోల్చడం, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శమని విమర్శించారు. 1990 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా...