ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. రాగి తీగలు,ఆయిల్ చోరీపై అప్రమత్తంగా ఉండాలి
ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. రాగి తీగలు,ఆయిల్ చోరీపై అప్రమత్తంగా ఉండాలి విద్యుత్ శాఖ ఏఈ కిషన్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 9 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను,ఆయిల్ చోరీ చేస్తున్న ఘటనల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏఈ కిషన్ సూచించారు. వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పరిరక్షణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.గ్రామాల వారీగా రైతులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గుర్తుతెలియని వాహనాలు సంచరించినా వెంటనే స్థానికులకు,...