ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం.
ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ నాయక్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9): తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని నాగర్కర్నూల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మూడవత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటివరకు ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల...