ఘట్‌కేసర్‌లో ఘనంగా సదర్ సమ్మేళన ఉత్సవాలు

*దున్నపోతుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో యాదవ సోదరుల సందడి (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 9: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ ఆరో డివిజన్ అంబేద్కర్ కూడలి వద్ద యాదవ సంఘం అధ్యక్షుడు మామిండ్ల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మాజీ అధ్యక్షులు వేల్పుల రామకృష్ణ యాదవ్, బండమీది యాదగిరి యాదవ్ తదితరులు హాజరయ్యారు. వారు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, ఆత్మగౌరవానికి...