రైల్వే ట్రాక్‌పై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఘట్‌కేసర్ పోలీసులు

రైల్వే ట్రాక్‌పై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఘట్‌కేసర్ పోలీసులు డయల్‌-100కు వచ్చిన సమాచారంతో హుటాహుటిన చేరుకుని ఇద్దరినీ రక్షించిన పెట్రోలింగ్ సిబ్బంది (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్, ప్రతినిధి /నవంబర్ 9: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా, ఘట్‌కేసర్ పోలీసులు సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్‌ఎఫ్‌సీ నగర్ రైల్వే గేట్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు...