ఈ నెల 12న నల్గొండకు జాతీయ ఎస్టీ కమిషన్
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా (నవంబర్ 9): నల్లగొండ జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పర్యటించనున్నారు.గిరిజనుల భూ సమస్యలు, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులపై వినతులు స్వీకరించి,గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు, పెండింగ్ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని,సమస్యలకు సంబంధించిన ఆధారాలు, వినతిపత్రాలను ముందుగానే అందజేయాలని సూచన చేశారు.గిరిజన సోదర సోదరీమణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు