ఎమ్మెల్యే చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
ప్రతినిధి నవంబర్ 09:(తెలంగాణ కెరటం) భీమిని మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన పోతురాజుల రమాదేవికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక చొరవతో రూ.1,85,500 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది.గత సంవత్సరం ప్రసవ సమయంలో రమాదేవికి సుమారు రూ.4 లక్షలకు పైగా ఆసుపత్రి ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ప్రత్యేకంగా స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు.ఈ నేపథ్యంలో మంజూరైన రూ.1,85,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రమాదేవికి అందజేశారు.ఈ సందర్భంగా రమాదేవి కుటుంబ సభ్యులు తమకు పెద్ద మొత్తంలో...