మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక
మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక విజ్ఞానం, వివేకం, వికాసంలో విద్యార్థులు ముందుండాలి: ఏపూరి వెంకటేశ్వరరావు తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 9 ధర్మసాగర్ ఎస్సీ సామాజిక భవనంలో సింగారపు పవన్ మాదిగ అధ్యక్షతన మాదిగ విద్యార్థి సమాఖ్య మండల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగంలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సాధించిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మాదిగల్లో అక్షరాస్యత పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...