నల్లూరులో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం
నల్లూరులో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10 నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వనరులను సంరక్షించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి...