కేజీబీవీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కేజీబీవీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతులు అందించాలి. ఇంటర్మీడియట్‌లో 100 శాతం ప్రవేశాలు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):  కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా ప్రమాణాలు, సౌకర్యవంతమైన వసతి, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి విద్యా ప్రగతికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి...