పంటల సాగులో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించాలి
పంటల సాగులో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించాలి తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10: రసాయన రహిత ఆహార ధాన్యాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నందున రైతులు వ్యవసాయంలో సేంద్రియ సాగు విధానాలను పాటించడం అలవాటు చేసుకోవాలి అని సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామం లో వ్యవసాయ యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ సాగు విధానాలు, జీవ ఎరువులు, నానో సాంకేతిక పరిజ్ఞానం పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఏడిఏ మాట్లాడుతూ విచక్షణ రహితంగా వాడే రసాయనాలు, పురుగు...