మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి పకడ్బందీ చర్యలు.
మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి పకడ్బందీ చర్యలు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలి. భూభారతి కార్యక్రమంలో భాగంగా భూ రీ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలి. మద్దిమడుగు గ్రామంలో భూ రీ సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం మద్దిమడుగు గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన భూ రీ సర్వే అవగాహన సదస్సులో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్య, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్...