గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్ తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10కామారెడ్డి: గౌడ కులస్తులను లక్ష్యంగా చేసుకుని నార్కోటిక్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లు దుకాణాల వద్ద అధికారుల దాడుల పేరుతో గౌడ కులస్తులను భయభ్రాంతులకు గురిచేయడం, వారి జీవనోపాధికి ఆటంకం కలిగించడం తగదని ఆయన...