విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ వంశీకృష్ణ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ వంశీకృష్ణ చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.10 కోట్ల నిధులు సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు..... మంచిర్యాల .....జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 మంది విద్యార్థులకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి...