భూ పునఃసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి

భూ పునఃసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 11: పోతారం గ్రామంలో గ్రామ సరిహద్దుల గుర్తింపుతో పునఃసర్వే ప్రక్రియ ప్రారంభంకామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పోతారం గ్రామంలో బుధవారం భూ పునఃసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి హాజరై గ్రామ సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, భూ పునఃసర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.సర్వే అధికారులు సమాచారం ఇచ్చిన వెంటనే రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు...