మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు
*పెద్దవాగు పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక దందా!* మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు అధికారులు స్పందించకపోవడంపై మర్మమేమిటో తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 11 : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామ పరిధిలో ఉన్న పెద్దవాగు నదీ పరివాహక ప్రాంతం నుంచి చలో విచ్చల విడిగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చొరవ చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక రవాణా...