తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.. టీజేఏసీ నేత శ్రీనివాస్.
అధికార, ప్రతిపక్షాలు ఉద్యమకారుల హక్కుల పట్ల స్పందించడం స్వాగతనీయం. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.. టీజేఏసీ నేత శ్రీనివాస్. తెలంగాణ కెరటం నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన,తెలంగాణ ఉద్యమకారుడు, పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ముందుకు రావడం స్వాగతించదగిన పరిణామమని టీజేఏసీ నేత శ్రీనివాస్ అన్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు వీరేశం, సామ్యూల్, జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రతాపరెడ్డి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ సహాయం కుటుంబానికి కొంతమేర...