నవంబర్ 15న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు
నవంబర్ 15న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు బిర్సా ముండా జయంతి సందర్భంగా భారీగా తరలిరావాలని బీజేపీ నేతల పిలుపు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీని జన్‌జాతీయ గౌరవ దివస్‌గా నిర్వహించనున్న సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో పోచారం డివిజన్ అన్నోజిగూడలోని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జి ఎన్. బిక్కునాథ్ నాయక్ కార్యాలయంలో...