పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ్! నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రధాన అజెండా..పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యం తెలంగాణ కెరటం (నల్గొండ జిల్లా ప్రతినిధి): ఒకవైపు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం..మరోవైపు వేలాది మంది నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలకు గొంతుకగా నిలవాలన్న సంకల్పం! ఉన్నత హోదాలో ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్షంగా ప్రజా జీవితంలోకి రావాలని యర్కల శ్రీనివాస్ గౌడ్ నిర్ణయించుకున్నారు. అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా పనిచేస్తున్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు.నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర...