ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేరడిగుంట ఎక్స్ రోడ్లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేరడిగుంట ఎక్స్ రోడ్లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్ నేరడిగుంట: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే సంకల్పంతో నేరడిగుంట గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేసింది.ఎన్నికల సమయంలో నేరడిగుంట ఎక్స్ రోడ్లో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించి, మార్కెట్ అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో, నేరడిగుంట ఎక్స్ రోడ్ మార్కెట్ అభివృద్ధి కోసం నేడు సొంత నిధులతో 25 కె.వి. ట్రాన్స్ఫార్మర్తో పాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం...