పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియామకం
పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియామకం నూతన బాధ్యతలు చేపట్టిన ఆకాష్ నాయక్‌కు నాయకుల ఘన సన్మానం.. అభినందనల వెల్లువ (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 11: పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఆకాష్ నాయక్‌ను ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కునాథ్ నాయక్, సీనియర్ నాయకులు దారావత్ తావూర్య నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా...