కోరుట్ల గడి బురుజుల స్థలాన్ని కాపాడే వరకు పోరాటం ఆగదు
కోరుట్ల గడి బురుజుల స్థలాన్ని కాపాడే వరకు పోరాటం ఆగదు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అఖిలపక్ష, ప్రజా సంఘాలతో కలిసి పరిరక్షణకు పిలుపు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 11 : కోరుట్ల పట్టణ చారిత్రక గుర్తింపుగా నిలిచిన గడి బురుజుల స్థలాల కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడి బురుజుల స్థలాల పరిరక్షణ, పట్టణ చారిత్రక వారసత్వ సంపదను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గడి బురుజుల...