డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్  సుమారు 100 మంది రక్తదానం.. రక్తదానం ప్రాణదానంతో సమానమని చాటిన దాతలుసదాశివపేట పట్టణంలోని సాయిరాం హాస్పిటల్‌లో డాక్టర్ ఇంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించగా, సుమారు 100 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను...