అభివృద్ధి పథంలో ఉమ్మడి మద్దూరు మండలం
అభివృద్ధి పథంలో ఉమ్మడి మద్దూరు మండలం రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రూ.50 లక్షలతో శ్రీరామ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.80 లక్షలతో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 11 ఉమ్మడి మద్దూరు మండలంలో అభివృద్ధి పనులకు వేగం పుంజుకుంది. మొత్తం రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. మద్దూరు మున్సిపాలిటీలోని 3వ వార్డులో రూ.50 లక్షలతో నిర్మించనున్న శ్రీరామ ఆలయానికి శంకుస్థాపన చేయగా, ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో రూ.80...