ఎల్ నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

ఎల్ నినో ప్రభావాలపై  రైతులకు అవగాహన   కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 11   మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని శేరితండా మరియు ధర్మసాగర్ గేట్ తండాలో గ్రామసభలు నిర్వహణ ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు శేరితండా గ్రామపంచాయతీతో పాటు ధర్మసాగర్ గేట్ తండాలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) పుణ్యవతి మాట్లాడుతూ ప్రస్తుత భూగర్భ జలాల పరిస్థితులను వివరించారు....