అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం

అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరైన యువ సేవకులు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: అనురాగ్ విశ్వవిద్యాలయంలో పశ్చిమ మండల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ పూర్వ శిబిరం–2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు దమన్, దీయూ, దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జాతీయ సేవా పథకం సేవకులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ చైర్మన్, జనగామ శాసనసభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య...