నాగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన గ్రామ కమిటీ ఏర్పాటు
నాగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన గ్రామ కమిటీ ఏర్పాటు తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజ ప్రతినిథి నవంబర్ 11 మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నాగంపల్లి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు కుర్వ రాము, దులం నవీన్, బాల్ చేందర్, సిరిపురం నరేష్ సమక్షంలో గ్రామ కమిటీ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా సంస్థాగత కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయిలో మరింత విస్తరించి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు....