బాలాజీ ఆలయంలో టికెట్ల ధరలు పెంచొద్దని వినతి
బాలాజీ ఆలయంలో టికెట్ల ధరలు పెంచొద్దని వినతి మల్లేశం / తెలంగాణ కెరటం ప్రతినిధి:అల్వాల్, నవంబర్ 11; దేవుని అల్వాల్ లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు,లడ్డూ ప్రసాదం, వివిధ పూజ కార్యక్రమాల టికెట్ల ధరలను పెంచవద్దని అల్వాల్ సామాజిక సేవకుడు జేఏసీ నాయకులు పటోళ్ల సురేందర్ రెడ్డి ఆలయ అధికారులను కోరారు.బుధవారం అల్వాల్ లో ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న ధరలనే యధావిధిగా కొనసాగించాలని ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్థానిక భక్తులతో కలిసి వినతిపత్రం అందజేశారు.పురాతనమైన ఈ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పేద మధ్యతరగతి భక్తులు వస్తుంటారని ధరలు పెంచితే సామాన్యులపై ఆర్థిక భారం...