సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 11 : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర హెచ్చరించారు. కోరుట్ల మున్సిపల్ కమీషనర్ రాఘవేంద్ర ఆదేశాల మేరకు బుధవారం అధికారులు కోరుట్ల పట్టణంలోని పలు కిరాణా, సూపర్ మార్కెట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన పరుచుకున్నారు. చెత్తను బయట పడేసిన ఓ ఇంటి యజమానికి 09,500 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కల్పించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చెయ్యని దుకాణాదారులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు....