నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:దుబ్బాక మండల కేంద్రంలో పెద్ద గుండవెల్లి గ్రామంలో సద్ది అనశవ్వ, అంజిరెడ్డి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.అర్హులైన...