సాగు భూమి సంరక్షణ. మరియు ఆయిలపామ్ సాగుపై అవగాహన కార్యక్రమం
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11,తెలంగాణ కెరటం:దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ రైతువేదిక లో బుధవారం రోజున రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి ప్రవీణ్ ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో ఉన్న నీరుని జాగ్రత్తగా వాడుకుంటూ పాటించవలసిన జాగ్రత్తలు, పంట మార్పిడి ఉపయోగం వివరించారు. యాసంగి లో భూగర్భ జలాలు తగ్గడం, విద్యుత్ సమస్యలు, చెరువులు కాలువలలో నీరు లేకపోవటం సమస్య ల వలన వరి పంట సాగు ఇబ్బంది అవుతుంది కావున వరి పంటకు బదులుగా అరుతడి పంటలయి న మక్కజొన్న, పొద్దు తిరుగుడు, పెసర్లు, బొబ్బర్లు మొ పంటలు వేసుకోవాలని సూచించారు. వరి పొలాలలో జీరో టిల్లేజ్ విధానం లో దున్నకుండా...