అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన - చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో నిన్న ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుడు నర్సింలు, చిక్కుడు రాజావ్వ ఇల్లు దగ్ధమై బాధిత కుటుంబాలకు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదం జరిగిన తీరును, జరిగిన నష్టాన్ని బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసా కల్పిస్తూ, వారికి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని,...