రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక ప్రతినిధి,(అక్బర్ పేట భూంపల్లి) నవంబర్ 11, తెలంగాణ కెరటం:అక్బర్ పేట భూంపల్లి మండలం తాల్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక...