రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి -దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దు – సన్న వడ్లకు రూ.500 బోనస్ వర్తిస్తుంది
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:దుబ్బాక: దుబ్బాక మార్కెట్ యార్డులో బుధవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సంగీత రవీందర్ తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి సూచించారు. రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా,పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని,...