బయో మైనింగ్ తోనే చెత్తశుద్ధికరణ ప్రక్రియ.

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్తను శుద్ధికరణ చేపట్టినట్లు దుబ్బాక పురపాలక చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ తెలిపారు. బుధవారం దుబ్బాక పురపాలక లోని లచ్చపేట శివారులో గల డంపింగ్ యార్డులో కోర్ బయో ఎనర్జీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియను పుర కమిషనర్ మహేష్ కుమార్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయో మైనింగ్ ప్రక్రియలో వివిధ దశల్లో శుద్దీకరణ ప్రక్రియ ద్వారా పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలన్నీ తొలగిపోతాయన్నారు.ఈ ప్రక్రియలో వ్యర్థాలనుంచి వివిధ దశల అనంతరం వచ్చే బయో ఎరువు...