రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించడమే అగ్రిషో లక్ష్యం

రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించడమే అగ్రిషో లక్ష్యం  125 స్టాళ్లతో మూడు రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన  రైతులు, పట్టణ ప్రజలు అగ్రిషోను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్12);రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా మూడు రోజుల పాటు అగ్రిషో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించే అగ్రిషోను రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు, పట్టణ...