కమ్మర్‌పల్లిలో సీసీ కెమెరాలు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు గ్రామ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ
దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారి సహకారంతో సుమారు రూ.2 లక్షల విలువైన 8 సీసీ కెమెరాలతో పాటు, రూ.2.50 లక్షల విలువైన 2 ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, రాత్రి వేళల్లో వెలుతురు సదుపాయం కల్పించేందుకు ఈ ఏర్పాట్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ కమ్మర్పల్లి గ్రామంపై ఉండాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ బరిగే సుజాత నరేష్‌తో పాటు ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమ్మర్పల్లి...