ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్లకు రూ.18,000/-లు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలి -ఆశ వర్కర్లు డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వినతి.
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 12, తెలంగాణ కెరటం:సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మె నోటీసు ఇస్తున్న ఆశ వర్కర్లు. అనంతరం సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆశ వర్కర్లకు ఫిక్స్ డు వేతనం 18000 రూపాయలు నిర్ణయించాలని పీఎఫ్,ఇఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆశా వర్కర్లు నిరంతరం బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సేవలందిస్తున్నారనీ గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి,బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారనీ తెలిపారు. సీజనల్,వ్యాధులు,అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్స్, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాలను...