ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి -చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 12, తెలంగాణ కెరటం:దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డుకు చెందిన తలారి సురేందర్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొండే గోపాల్ రెడ్డి గురువారం రోజున వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల భరత్, మట్ట కిషన్...