కొడంగల్ లో ఒకే గదిలో మూడు క్లాసులు

_ సీఎం సొంత జిల్లాలోనే ప్రభుత్వ_ పాఠశాలలపై నిర్లక్ష్యం!_ తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు- వరండాల్లోనే చదువులు  తెలంగాణ కెరటం తాండూర్ ప్రతినిధి:  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని చెబుతున్న పాలకుల మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోని తాండూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలకు కనీస తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.పట్టణంలోని 8వ వార్డు రాజీవ్, ఇందిరమ్మ కాలనీల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే గదిలో రెండు, మూడు...