ఎర్రబెల్లి గ్రామ మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

ఎర్రబెల్లి గ్రామ మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక విద్యార్థులు ఇప్పటినుంచే ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలి బొడ్డు శాంతి సాగర్ మాదిగ తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ వేలేరు మండల ఇన్‌చార్జి బొడ్డు శాంతి సాగర్ మాదిగ మాట్లాడుతూ, విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే కష్టపడి మాదిగ విద్యార్థి సమాఖ్య ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని...