​మందమర్రిలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం 101.5 లీటర్ల మద్యం స్వాధీనం

బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం... మందమర్రి సి.ఐ. పి రమేష్ హెచ్చరిక తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... మంచిర్యాల..​మందమర్రిఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) రమేష్ పర్యవేక్షణలో మందమర్రి సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) జి నరేష్ మరియు పోలీసు సిబ్బంది పట్టణంలోని బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు.  ​ఈ దాడుల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న 4 బెల్ట్ షాపులను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఆయా షాపుల నుండి సుమారు ₹71,000/- విలువైన 101.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.  ​ఈ సందర్భంగా మందమర్రి సి.ఐ. రమేష్...