నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం
ముఖ్యమైన పాయింట్స్:నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ ప్రసన్నాంబ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 13 : ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ తెలిపారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ అధ్యక్షతన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం అదనపు కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) నిబంధనలు–2022 ప్రకారం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 అమలుపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.ప్రసన్నాంబ మాట్లాడుతూ,. జిల్లాలోని అన్ని ప్రైవేట్...