గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం
తాండూర్, నవంబర్ 13, తెలంగాణ కెరటం ప్రతినిధి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాం అని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.యాలాల్ మండలం జుంటుపల్లి గ్రామంలో రూ.50.95 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు.రూ.45.75 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.రూ.5.20 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన. అనంతరం 735 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు వారి గ్రామాలకే వచ్చి స్మార్ట్...