మచ్చ బొల్లారం జడ్పిహెచ్ఎస్ లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు
అల్వాల్ నవంబర్ 13 (తెలంగాణ కెరటం న్యూస్) అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అల్వాల్ సర్కిల్ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దోమల నివారణకై డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి బొండాలు, నీళ్ళ తొట్టిలలో ఉండే నీళ్ళను తీసివేయాలని తెలిపారు. నిల్వ ఉండే నీటిలో లార్వా వృద్ధి చెంది...